Tuesday, December 3, 2024

Sanathnagar – డర్టీ సిఐ పురేంద‌ర్ రెడ్డి సస్పెండ్..

అందంగా ఉన్నావ్‌.. అక్క‌డికి వ‌చ్చెయ్‌!
ఫిర్యాదు చేసేందుకు వ‌స్తే మ‌హిళ‌పై వ‌ల‌
ప‌ర్స‌న‌ల్‌గా మేసేజీలు.. వాట్సాప్‌లో చాట్‌
పోలీస్ క‌మిష‌న‌ర్‌ను ఆశ్ర‌యించిన బాధితురాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైదరాబాద్: ఓ మహిళపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన సనత్ నగర్ స‌ర్కిల్ ఇన్స్పెక్టర్ పురేంద‌ర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేర‌కు సైబరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అవినాష్ మ‌హంతి శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కోసం వ‌చ్చిన మహిళతో సీఐ అసభ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు తెలుస్తోంది. అందంగా ఉన్నావ్‌.. అక్క‌డికి రావాల‌ని చాటింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో బాధితురాలు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌ని ఆశ్రయించింది. సీఐ త‌న‌తో చేసిన చాటింగ్ వివ‌రాల‌ను అధారాల‌తో స‌హా అంద‌జేసింది. సీఐ పంపిన‌ అసభ్య మెస్సేజీల ఆధారంగా స‌స్సెండ్ చేస్తూ సీపీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement