న్యూఢిల్లీ: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌లోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని
ఢిల్లీలోని తలాక్ టోరా స్టేడియంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ ముల్లికార్జున ఖర్గే, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితర కీలక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ పవిత్రతను కాపాడింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే,, మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోందని పైర్ అయ్యారు, రాజ్యాంగ పరిరక్షణలో రాహుల్ గాంధీ వెంట దేశ ప్రజలంతా ఉన్నారన్నారు. ప్ర తి ఒక్క వర్గానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కాపాడింది కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు.
కుల గణనతోనే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని.. ఇందుకోసమే దేశవ్యాప్తంగా కుల గుణన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు, దేశంలో సామాజిక న్యాయాన్ని అందించింది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ప్రకారమే తెలంగాణలో కుల గణన చేపట్టామని.. కుల గణన సర్వే ఇప్పటి వరకు 92 శాతం పూర్తి అయ్యిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జన గణన సర్వేలోనూ కులాల లెక్కలు తీయాలని ఈ సందర్భంగా రేవంత్ డిమాండ్ చేశారు.