Tuesday, November 19, 2024

TS : స‌మ్మ‌క్క సార‌ల‌క్క‌ల‌కు మెండుగా కానుక‌లు…

ఈ ఏడాది అత్యంత ఘనంగా సాగిన వనదేవతల పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు.

అక్కడ భక్తులు వేసిన కానుకలను ఆరు రోజుల పాటు పటిష్ఠ భద్రత నడుమ లెక్కించారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 350 మందికి పైగా సిబ్బంది, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -

13 కోట్ల న‌గ‌దు…
ఈ ఏడాది వనదేవతల మహాజాతరకు మొత్తం రూ.13,25,22,511 ఆదాయం సమకూరినట్లు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం వెల్లడించారు. అదనంగా 779.800 గ్రాముల బంగారంతో పాటు, 55.150 కిలో గ్రాముల వెండి ఆభరణాలు కూడా కానుకలుగా వచ్చాయని తెలిపారు. అంతే కాకుండా వివిధ దేశాల కరెన్సీ నోట్లు, ఒడి బియ్యం, ఇతర కానుకలను భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట జరిగిన మహా జాతరకు రూ.11,45,34,526 ఆదాయం రాగా గతంతో పోలిస్తే ఈసారి రూ.1,79,87,985 ఆదాయం పెరిగిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement