Monday, November 18, 2024

ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగాయి, ఖరీఫ్‌లో తీసుకోబోమని ముందుగానే చెప్పాం: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రాల అవసరాలు పోను మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్‌లోకి ఎఫ్‌సీఐ తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రాలతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బియ్యాన్ని సేకరిస్తుందని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. ఎంపీ దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు బుధవారం ఆమె లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఇటీవలికాలంలో ఒక్కసారిగా ఉప్పుడు బియ్యం నిల్వలు పెరగడం వల్ల 2021-22 ఖరీఫ్ సీజన్‌లో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఇచ్చామని తెలిపారు. పారా బాయిల్డ్ రైస్‌ను తమ అవసరాల కోసం రాష్ట్రాలు సేకరించుకోవచ్చని సూచించారు. పారా బాయిల్డ్ రైస్ వినియోగించే తమిళనాడు, కేరళ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు సొంతంగా సేకరించుకోవడం వల్ల కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు సరఫరా తగ్గిందని జవాబులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement