హైదరాబాద్ – ప్రజా పాలన దరఖాస్తులు అమ్ముతున్న మీ సేవా కేంద్ర నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివారులోని పటాన్చెరులో రూ. 20 చొప్పున ఒక్కో అప్లికేషన్ మీ సేవా నిర్వాహకుడు అమ్ముతున్నాడని పలువురు అధికారులు దృష్టికి తెచ్చారు.
దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అతడిపై కేసు నమోదు చేయించారు.. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పందిస్తూ, ప్రజాపాలన అప్లికేషన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 5 గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం దరఖాస్తులకు ఎలాంటి కొరత లేదన్నారు. అందరికీ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బయట కొనుగోలు చేయవద్దని సూచించారు. అమ్మిన వారిపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన అప్లికేషన్లు బయట కొనుగోలు చేయవద్దని, అలా తీసుకున్నా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.