Tuesday, November 26, 2024

న‌కిలీ ప‌త్తి విత్త‌నాల విక్ర‌యం.. ఇద్ద‌రి అరెస్ట్

నకిలీ ప‌త్తి విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ , దేవరుప్పుల పోలీసులు ..వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి అరెస్టు చేశారు. వారి నుండి లక్ష మూడు వేల ఐదు వందల యాభై రూపాయల విలువ గల 40 కిలోల నకిలీ విడి విత్తనాలు .. బుల్లెట్ -5G రకానికి చెందిన 23 నకిలీ పత్తి విత్తనాల పాక్కెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్ట్ కి సంబందించిన వివరాల‌ను టాస్క్ ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి వెల్ల‌డించారు. నేడు నకిలీ విత్తనాలు సరఫరా అవుతన్నాయనే పక్కా సమాచారంతో దేవరుప్పుల బస్ స్టేజ్ వద్ద .. టాస్క్ ఫోర్స్ .. దేవరుప్పుల పోలీసులు తనిఖీ నిర్వ‌హించారు. కాగా అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు రెండు మూటలతో కనిపించగా వాటిని తనిఖి చేసి, వారి వద్ద నుండి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, తాము గతంలో కామారెడ్డి గ్రామనికి చెందిన రామారావు అనే వ్యకికి 25 కిలోల నకిలీ విత్తనాలు ఇచ్చామ‌ని స‌మాధానం చెప్పారు. కాగా నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్ స్పెక్టర్లు కె. శ్రీనివాసరావు, కె. జనార్ధన్ రెడ్డి, సత్యనారాయణ, రాంబాబు ..ఎస్సైలు పి. దేవేందర్, బి. శరత్ కుమార్, వి. లవన్ కుమార్, డి. రాజు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అబినందిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement