ప్రభన్యూస్ : ప్రజా రవాణ ప్రథమ కర్తవ్యంగా పని చేస్తున్న ఆర్టీసీ తప్పనిసరి పరిస్థితులలో చార్జీలను పెంచాల్సి వస్తోందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. సంస్థను దీర్ఘకాలంగా ఆదరిస్తున్న ప్రయాణికులు ప్రస్తుత పరిస్థితులను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. కరోనా కారణంగా సంస్థ రాబడి భారీగా తగ్గిందని పేర్కొన్నారు.
ఆర్టీసీ చార్జీలు ఒక్క తెలంగాణలోనే కాదని, దేశంలోని వేర్వేరు రాష్ట్రాలలోని రవాణా సంస్థలు కూడా పెంచాయన్నారు. డీజెల్ భారం కూడా మోయలేని విధంగా తయారైందన్నారు. డీజెల్ ధరతో పాటు విడి భాగాల ధరలు, నిర్వహణ వ్యయం కూడా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో స్వల్పంగా టికెట్ ధరలను పెంచక తప్పడం లేదన్నారు. ధరలు పెంచినప్పటికీ మిగతా రవాణా సంస్థల కంటే చౌకగానే ప్రయాణ సేవలను అందిస్తామని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital