Monday, November 18, 2024

Attack: మ‌హిళా కండ‌క్ట‌ర్ పై ఉచిత‌ ప్ర‌యాణీకుల దాష్టికం.. ఆర్టీసీ డ్రైవర్​ను చితకబాదిన ఆటోవాలాలు..

హైదరాబాద్‌: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో బూర్గంపాడు వ‌ద్ద మ‌హిళ ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడమే కాకుండా అస‌లు కండ‌క్ట‌ర్ తో ప‌ని ఏముందంటూ ఆమెను బ‌ల‌వంతంగా దించేశారు మ‌హిళ‌లు.. దీంతో ఆ మ‌హిళా కండ‌క్ట‌ర్ కన్నీటిపర్యంతమయ్యారు.

అలాగే కొత్త‌గూడెంలో ఆటో డ్రైవ‌ర్లు ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ పై దాడి చేశారు..తమ ఆటోలోని ప్ర‌యాణీకులందూ ఆర్టీసీ బ‌స్సుల‌లో వెళ్లిపోతుండటంతో ఆగ్ర‌హంతో ఆత‌డిపై దాడికి దిగారు .. ఈ ఘటనల‌ను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది.

దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్‌ స్పందిస్తూ..’టీఎస్‌ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement