ఈరోజు ఉదయం ట్విట్టర్ ద్వారా షేర్ అయిన ఓ వార్తకు సంబంధించి మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. నిర్మల్ జిల్లా అధికారులకు వార్త తెలియజేసి.. ఆ పాపను ఆదుకోవాలని సూచించారు. దీంతో స్పందించిన కలెక్టర్ ముషారఫ్ అలీ ఆ పాపను దత్తత తీసుకున్నట్టు వెల్లడిస్తూ ఫొటోను షేర్ చేశారు..
విధిరాత అంటే ఇట్లనే ఉంటదా..
కొంతకాలం క్రితం తండ్రి చనిపోయాడు.. ఇప్పుడేమో అనారోగ్యంతో తల్లి చనిపోయింది. దీంతో ఐదేండ్ల పాప అనాథగా మారింది.. తల్లి డెడ్‌బాడీ దగ్గర బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్‌బిడ్ విలేజ్‌లో జరిగింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఆ పాపకు మంచి భవిష్యత్ అందించేలా చర్యలు తీసుకోవాలి.. మానవతా మూర్తులు, దయార్థహృదయం ఉన్నవారు ఎవరైనా ఆ చిన్నారికి సాయం చేసి ఆదుకోవాలని ఆ జిల్లాకు చెందిన వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు, ప్రజల దేవుడు సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ట్విట్టలో ఈ ఫొటో పోస్టు చేశాడు..