Tuesday, November 26, 2024

Safe Driving – ప్రమాద రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. మంత్రి పువ్వాడ..

ఖమ్మం : ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి డ్రైవింగ్ రూల్స్ తెలిసి ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. Vdo’s కాలనీ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ఐదవ రోజు కొనసాగుతున్న ఉచిత లైసెన్సు కార్యాలయంలో భాగంగా పాల్గొన్నారు.
నిన్న ఆన్లైన్ చేసుకున్న వారికి నేడు లెర్నింగ్ లైసెన్స్(LLR) ధృవ పత్రలను మంగళవారం పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పత్రలను పంపిణి చేశారు.


ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. ఇటీవలే కాలంలో నగరం బాగా అభివృద్ది చెందిన దృశ్య రోడ్లు వెడల్పు పెరిగిన దరిమిలా వాహనాలు పెరిగిపోయాయని, దానికి తోడు వాహనాల వేగం కూడా పెరిగిందన్నారు.
దీంతో వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయని అనేక మంది లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతున్నట్లు తన దృష్టికి అనేక మార్లు వచ్చాయని పేర్కొన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో 10వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నామని, పువ్వాడ ఫౌండేషన్ ద్వారా సొంతంగా దాదాపు రూ.50 లక్షలు భరించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వాహనాలు విపరీతంగా పెరిగాయని, వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య కూడా నాలుగు ఇంతలు పెరిగిందన్నారు. రవాణా శాఖ గణాంకాల ప్రకారం 2014లో తెలంగాణలో 70 లక్షల వాహనాలు ఉండగా నేడు ఆ సంఖ్య 1.52కోట్లకు చేరిందన్నరు. ఇందులో 1.11కోట్ల ద్విచక్ర వాహనాలే ఉన్నాయిని ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.


దాన్ని దృష్టిలో ఉంచుకుని 18సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకుడు లైసెన్స్ పొందాలని, లైసెన్స్ పొందాలంటే చాలా సమయం వేచి ఉండాలనే కారణంతో చాలా మంది తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలా అనేక మంది వివిధ ఘటనలలో అనుకొని ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా పోలీసులు అపే జాడ్యం పోవాలన్నరు. వారికి పని లేకుండా చేయాలన్నారు. నేడు 93 మందికి LLR అందజేశామని, నేటి వరకు మొత్తం 352 మంది LLR లైసెన్స్ పొందారన్నారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, RTO కిషన్ రావు, జిల్లా RTA మెంబర్ వల్లభనేని రామారావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, MVI వరప్రసాద్, RJC కృష్ణ, మేకల సుగుణ రావు, తన్నీరు శోబారాణి, భాస్కర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement