Wednesday, November 20, 2024

స‌దర్ సమ్మేళనం.. యాదవులు ఘనంగా జరుపుకునే వేడుక..

స‌ద‌ర్ స‌మ్మఏళ‌నాన్ని యాద‌వులు ఘ‌నంగా జ‌రుపుకుంటార‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద నగరంలో ని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సదర్ వేడుకలలో పాల్గొనే దున్న రాజుల ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపావళి ప్రతి సంవత్సరం సదర్ ను ఎన్నో సంవత్సరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో సదర్ ను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నారాయణ గూడ లో నిర్వహించే సదర్ ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. హైదరాబాద్ నగరంలో మాత్రమే నిర్వహించే సదర్ సమ్మేళనం ప్రస్తుతం మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా నిర్వహిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

క్రమ క్రమంగా రాష్ట్ర మొత్తం విస్తరిస్తోంది అని చెప్పారు. ఈ నెల 5 వ తేదీన ఖైరతాబాద్, ఎల్లారెడ్డి గూడ, లాల్ బజార్ తదితర ప్రాంతాల్లో, 6 వ తేదీన నారాయణ గూడలో సదర్ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు మంత్రికి వివరించారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, సదర్ నిర్వాహకులు మధు యాదవ్, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement