Thursday, January 9, 2025

Adilabad | బెట్టింగ్ కు మ‌రో యువ‌కుడి బ‌లి!

  • ఆదిలాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌
  • యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఆదిలాబాద్ : తెలంగాణ‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మ‌రో యువ‌కుడు బ‌ల‌య్యాడు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండ‌లం పిప్ప‌ర్‌వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అభ్యుదయ హాస్టల్ కిచెన్ సహాయకుడిగా పని చేసే సాయి బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పోవడం వల్ల మనస్థాపం చెందాడు. అభ్యుదయ పాఠశాల ఆఫీస్ వంతెనల వద్ద ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా బ‌ల‌వుతున్న యువ‌కులు..
ఒక వైపు ఆన్‌లైన్ మోసాలు.. మ‌రోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఇలా ఎంద‌రో యువ‌కులకు వ్య‌స‌నంగా మారుతోంది. దీంతో న‌ష్ట‌పోతున్న వారు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతున్నారు. మనీ వాలెట్‌ను డౌన్లోడ్‌ చేసుకుని అందులోకి బ్యాంకు ఖాతా, ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసుకుంటున్నారు. ఈజీగా మ‌నీ సంపాదించాల‌న్న ఆలోచ‌న ఉన్న‌వారు ఇలాంటి ఉచ్చులో ప‌డుతున్నారు.

ఈ మాయదారి రక్కసిని ఖతం చేసేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చాపకింద నీరులా తన పని కానిస్తూనే ఉంది. వీటి కోసం అప్పులు చేసి అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ.. మనస్థాపానికి గురవుతున్నారు. ఆదాయం లేక, ఇంట్లో అడగలేక, మళ్లీ అప్పులు చేయలేక.. ఏం చేయాలో అర్థంకాకపోవడంతో ప్రాణాల మీద‌కి తెచ్చుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement