Friday, November 22, 2024

Sacked! – తెలంగాణ వర్శిటి విసి ర‌వీంద‌ర్ గుప్తా బ‌ర్త‌ర‌ఫ్?

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలం గాణ విశ్వవిద్యాలయం వివాదాలకు ఇక తెరపడనుంది. ఉప కులపతి రవీందర్‌ గుప్తాను భర్తరఫ్‌ చేయాలని కోరుతూ గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాసినట్లు తెలిసింది. ఇటీవల ఈసీ పిర్యాదుతో ఏసీబీ, విజిలెన్స్‌ యూని వర్సి టీలో, వీసీ నివాసాలపై తనిఖీలు చేపట్టారు. వీసి అక్ర మాలు తేటతెల్లం అయ్యాయి. దీంతో ప్రభుత్వం సీరియస్‌ గా పరిగణించి వేటు వేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. వీసీ ని భర్తరఫ్‌ చేయడానికి గవర్నర్‌ కు అధికారం వుంది. అందుకు వీసీ అక్రమాలను పరిగణలోకి తీసుకుని గవర్నర్‌ కు లేఖ రాసేందుకు సిఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలను పసిగట్టిన వీసీ రాజీ మార్గంలో ప్రయత్నాలు చేశారు. రాజీ ప్రయత్నాలు పలించక పోవ డంతో ఇక రాజీనామా శరణ్యం అయ్యింది. భర్తరఫ్‌ కి ముందే యధావిధిగా ప్రొఫెసర్‌ యాదగిరిని రిజిస్ట్రార్‌ గా తిరిగి యధాస్థానంలో నియమించిన వీసీ చివరి ప్రయ త్నంలో వున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే గత కొన్ని నెలలుగా నెలకొన్న వివాదాలు యూనివర్సిటీ పరువును తీశాయి. అనేక అక్రమాలకు వేదికగా మారింది. విద్యార్థుల ఆందో ళనలు, అధ్యాపక, ఉద్యోగ సిబ్బంది వెతలు, పాలక వర్గం పట్టింపు ధోరణులు ఒకవైపు అయితే ఉపకులపతి రవీందర్‌ గుప్తా వ్యవహారం మరోవైపుగా తెయూ సమస్యల నిల యంగా మారింది. వీసి తీరుతో అక్రమాలు, అవినీతి, వివక్ష లతో విశ్వవిద్యాలయం వివాదలయంగా మారింది. యూని వర్సిటీలో అక్రమ నియామకాలు, అడ్డగోలు ఖర్చులు, అవివేకమైన నడవడితో వీసీ నియంతత్వంగా వ్యవ హ రించారు. ఎట్టకేలకు వీసీ పై ప్రభుత్వం వేటు వేసేం దుకు సిద్దం కావడంతో ఇక వివాదాలకు తెరపడనుంది.

మోనార్క్‌గా వీసీ వ్యవహారం
ఎవరు చెప్పినా వినకుండా వీసీ రవీందర్‌ గుప్తా మోనార్క్‌ గా వ్యవహారం కొనసాగించారు. ఉద్యోగుల నియామకాలు, సీట్ల కేటాయింపు, ఖర్చులు, కొనుగోళ్లు, ఇతర అనేక వాటిల్లో వీసీ ఏకపక్ష నిర్ణయాలతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మ#హళ హాస్టళ్ల లో రాత్రి వేళల్లో వెళ్లి డాన్స్‌ లు చేసి హంగామా చేసిన వీడి యాలు వైరల్‌ అయ్యాయి. ఇలా ఒక విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఎవరు ఊ హంచని విధంగా ప్రవర్తించారు. ఉన్న తాధికారులను, మంత్రి, ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయ కుండా నియంతత్వంగా వ్యవ హరించారు. విద్యార్థులు, పాలక మండలిని ఏమాత్రం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా చేసుకుంటూ పోయాడు. ఈ పరిణామాలు చివరికి వీసీ మెడకు చుట్టుకున్నాయి. అనేక హచ్చరికలు, సూచనలు చేసినా నాకేంటి అన్నట్లుగా వీసీ ఒంటెద్దు పోకడలకు పోయారు.

ఎట్టకేలకు ఏసీబీ,విజిలెన్స్‌ చట్రంలో ఇరుక్కోవ డంతో ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో భయపడ్డ విసి రవీందర్‌ గుప్తా రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. చేసిన తప్పులు సరిదిద్దు కోవడానికి అవకాశం ఇవ్వాలని కాళ్ళబేరానికి దిగారు. లెక్కలేనన్ని తప్పులు చేసి క్షమించాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. వీరిని కలిసేందుకు నివాసాలకు వెళ్లినప్పటికీ వీసీని నిర్దాక్షిణ్యంగా నిరాకరించారు.

- Advertisement -

నవీన్‌ మిట్టల్‌తో వీసీ కాళ్ళబేరం?
ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ను కలిసిన వీసీ రవీందర్‌ కాళ్ళ బేరానికి వచ్చినట్లు సమాచారం. ఒక సందర్భంలో నవీన్‌ విట్టల్‌ తెలంగాణ యూనివర్సిటీలో కేవలం ఒక సభ్యుడు మాత్రమేనని వీసీ రవీందర్‌ గుప్తా తేలికగా కొట్టి పారేశారు. అనేకసార్లు నవీన్‌ మిట్టల్‌ విసిని హచ్చరించారు. అయినప్పటికీ రవీందర్‌ గుప్తా ధోరణి ఎంత మాత్రం మారలేదు. ఏసీబీ, విజిలెన్స్‌ దాడులు జరగు తున్నయనే సమాచారంతో విశ్వవిద్యాలయంలోని ఫైళ్లను, సిడీలను, ఇతర కీలక పత్రాలను తీసుకొని పరారయ్యారు.

5 బందాలు ఏకకాలంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారం విశ్వ విద్యాల చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. పారిపోతున్న వీసీ రవీందర్‌ గుప్తాను వెంబడించి కామారెడ్డి వద్ద పట్టుకొన్నారు. ఆయన వద్ద ఉన్న సీడీలు, ఫైళ్లను, ఇతర కీలక సమాచారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆయన ఇంటిలో కూడా ఏమాత్రం బయటకు పొక్కకుండా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వ హంచినట్లు తెలిసింది. ఇక తనకు మరో మార్గం లేక రాజీకి వచ్చినట్లు తెలిసింది. అయితే విసి గత రెండేళ్లుగా వ్యవహరించిన తీరు పట్ల తీవ్రంగా విసిగి వేసారిన జిల్లా మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆగ్ర హంతో ఉన్నారు. ఇక ఉన్నతాధికారులు కనికరం లేకుండానే రవీందర్‌ గుప్త పై చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement