ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో కందుకూరు మండలంలోని 11 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 4 ,64 ,500 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. అత్యవసర సమయాల్లో పేదలు ఆధునిక వైద్య సేవలు పొందేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తోందన్నారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో అమలు చేస్తున్న ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. సీఎంఆర్‌ఎఫ్ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతోందన్నారు. అనారోగ్యం బారినపడి ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా కుంగిపోయిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..