శంకర్ పల్లి (ప్రభ న్యూస్) రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో రజాకర్ల, దేష్ ముఖ్ ల వారి అనుచరుల అరాచకాలను ఎదురొడ్డి న వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి బడుగు బలహీన వర్గాల లో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణలో జరిగిన అరాచకాలను ఎదురొడ్డి నిలబడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆమె పేర్కొన్నారు, తెలంగాణ మహిళా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ చాకలి ఐలమ్మ అని ఆమె పేర్కొన్నారు,
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో కమ్యూనిస్టుల మద్దతుతో దొర దురహంకారానికి ఎదురొడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆమె పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప వనిత చాకలి ఐలమ్మ అని ఆయన పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి ఎంపీటీసీ ప్రవల్లిక వెంకట్ రెడ్డి సర్పంచ్ నరసింహారెడ్డి రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.