మహేశ్వరం అర్బన్ సెప్టెంబర్ 2 ప్రభ న్యూస్ – జలపల్లి మున్సిపాలిటీ అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు . జల్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని 12,13,14,15 వార్డుల్లో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్ల వెడల్పు, సీసీ రోడ్డు,డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబితా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పహాడీ షరీఫ్ బాబా హజ్రత్ షర్ఫోద్దీన్ దర్గాకు మంత్రి పూలతో కూడిన చాదర్ ను సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందన్నారు. మున్సిపాలిటీ 25 కోట్లు నిధులు ఇచ్చిన ఘనత కేసిఆర్ దక్కుతుందని అన్నారు. పహాడీ షరీఫ్ దర్గాకు ర్యాంప్ రోడ్డు,షెడ్డు ఏర్పాటు చేస్తున్నందుకు ముస్లిం సోదర సోదరీమణులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. యూసఫ్ పటేల్ కౌన్సిలర్స్ షేక్ అబ్జల్, శంషుద్దీన్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు