అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారని ,సంవత్సరానికి 1లక్ష ఉద్యోగాలు కలిపిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చదివితే ఉద్యోగాలు లేవని ,పంట పండిస్తే కొనేటోళ్లు లేరని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి మండిపడ్డారు .నిన్న.. మొన్నటివరకు ప్రతి గింజ కొంటామని ఐకేపీ సెంటర్ లు ఓపెన్ చేసుకుంటూ మంత్రులు ,ఎమ్మెల్యే లు ప్రగల్బాలు పలికి ఇప్పుడు కేంద్రం కొనటం లేదనటం సిగ్గుచేటు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ధర్నా చౌక్ వద్దని ధర్నాలే చేయవద్దని ,రాష్ట్రంలో ఎప్పుడు పోలీస్ ఆక్ట్ అమలు చేపించే మీకు ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు .ఈ దొంగ ధర్నాలు చేయడం ప్రభుత్వం మీద వున్నా వ్యతిరేకతను ప్రజల దృష్టి మరల్చటానికే అన్నారు .ఈ ఏడు సంవత్సరాలలో ఉద్యోగాలు వేయక ,నిరుద్యోగులు వ్యవసాయం చేస్తుంటే పండించే పంట కొనేవారు లేక రైతులు హత్మ హత్యలు చేసుకునే పరిస్థితుల్లో వున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు అపి వెంటనే రైతులను ఆదుకుంటూ వెంటనే పంటను కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు ..ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్ రెడ్డి పీషర్ మేన్ మండల అధ్యక్షులు లచ్చొల రవీందర్ తోగుట గ్రామఎస్సీ సెల్ అధ్యక్షులు కాసర్ల నర్సింలు, విష్ణు మధు తదితరులు పాల్గొన్నారు,
Advertisement
తాజా వార్తలు
Advertisement