Tuesday, November 19, 2024

ఏప్రిల్‌ 7 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు, షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏప్రిల్‌ 7 నుంచి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-2) పరీక్షలు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి గానూ 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. ఏప్రిల్‌ 7 నుంచి 16 వరకు పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌సీఈఆర్టీ విడుదల చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 వరకు జరగనున్నాయి. 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు సబంధించిన చర్యలు ఆయా జిల్లా విద్యాధికారులు తీసుకోవాలని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ రాధారెడ్డి ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement