హైదరాబాద్, ఆంధ్రప్రభ: పెరిగిన గ్రామీణ పోలింగ్‌పై ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఈ దఫా రూరల్ ఓటింగ్ శాతం పెరుగుదల రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పదును పెడుతోంది. గతంలో పెరిగిన రూరల్ ఓట్‌షేర్ బీఆర్‌ఎస్‌కు లాభించగా, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో తమకే లాభమని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ దఫా దాదాపు 70శాతానికి పైగానే పోలింగ్ నమోదైనట్లు- తెలుస్తోంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 80శాతం పైగా నమోదు కానుందని పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. దీంతో ఎక్కువ పోలింగ్ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా అన్ని పార్టీలూ ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటు-ంటాయి. అందుకే పోలింగ్ శాతం పెరగడంపై కూడా అంచనాలు అనేకం వస్తుంటాయి. సైలెంట్ ఓటింగ్ కూడా ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. సైలెంట్ వేవ్ ప్రకారం పోలింగ్ జరిగిందంటే అది ఏ పార్టీకి లాభం? అధికారంలో ఉన్న పార్టీకా? లేక ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకా? అన్నది మాత్రం డిసెంబర్ 3న తేలనుంది. ఎవరికి వారుగా పార్టీలు పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభిస్తుందన్న అంచనాలు, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటర్ మదిలో ఏముందో… ఏవైపున ఓటింగ్ టర్నవుట్ అయిందోననే ఊహాగానాలు, చర్చలకు డిసెంబర్ 3న సమాధానం దొరకనుంది.
ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువ ఏజెన్సీలు చెప్పింది కాంగ్రెస్‌కే లాభమని చెబుతున్నారు. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉందని విపక్ష పార్టీలు చెబుతుంటాయి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడుగట్టు-కుని ఉండి ఓట్ల రూపంలో బయటపడుతుందన్నది అంచనా. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని విపక్ష నేతలు తమ అభిప్రాయంగా చెబుతున్నారు. పదేళ్ల పాటు- అధికారంలో ఉండటం, తమ సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపకపోవడంతోనే ప్రజలు ఆగ్రహానికి గురై ఎక్కువ మంది పోలింగ్‌కు హాజరయ్యారన్నది విపక్షాలు చెబుతున్నాయి. తాము ఇచ్చిన హామీలు కూడా పనిచేయడం వల్లనే ఎక్కువ మంది పోలింగ్‌కు వచ్చి తమకు మద్దతుగా నిలిచారని విపక్ష పార్టీలు తమకు తాము సర్ది చెప్పుకుంటాయి.
పోలింగ్ శాతం పెరగడం వల్ల అధికారిక పార్టీకి నష్టమా? ప్రతిపక్షానికి లాభమా? అనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం దేనికి సంకేతమనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభమని గులాబీ పార్టీ నేతల భావన. తమ సంక్షేమ కార్యక్రమాలకు రూరల్ ఏరియాలో ఆదరణ ఉండడం వల్లే జనం పెద్ద ఎత్తున ఓట్లు- వేశారని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు తదితర పథకాలతో నగరాలు, పట్టణాల్లో ఉంటు-న్న గ్రామీణ ప్రాంతాల వాళ్లు వెళ్లి ఓటు- వేశారని చెప్పుకొస్తున్నారు.
ఇటు- ప్రతిపక్షం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు- పెరగడం తమకు అనుకూలిస్తుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే జనం పల్లెలకు వెళ్లి కసిగా ఓటు- వేశారని… ఇది తమకు లాభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓట్లు-…. టోటల్‌గా పెరిగిన ఓట్ల శాతం ఎవరికి లాభిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాల్సిందే.