ఈ నెల 5నుంచి 27వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహించనున్నారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఏడు నగరాలకు చెందిన ఫ్రాంచైజీల జట్లు పోటీపడనున్నాయి. కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ వాలీబీల్ లీగ్‌లో పోటీపడతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన జట్టు బ్లాక్ హాక్స్ జెర్సీని, అధికారిక మ్యాచ్‌బాల్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈవో భట్టాచార్య బహూకరించారు.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో మొత్తం 24మ్యాచ్‌లు జరగనున్నాయి. సోనీ సిక్స్, సోనీ టెన్ 2, టెన్ 3, టెన్ 4, సోనీ లైవ్‌లో వాలీబాల్ లీగ్ ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రూపే ప్రైమ్ వాలీబాల్ సీఈవో జాయ్ భట్టాచార్య, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమాని అభిషేక్‌రెడ్డి కనకాల, సహ యజామాని శ్యామ్ గోపు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..