Saturday, November 16, 2024

TS: ప‌దేండ్లు పాలించిండ్రు… యూనివ‌ర్సిటీ కాంపౌండ్ కూడా నిర్మించ‌లే… మంత్రి పొంగులేటి

రాష్ట్రాన్ని ప‌దేండ్లు పాలిటించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌నీసం కాక‌తీయ యూనివ‌ర్సిటీ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించ‌లేక‌పోయింద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి దుయ్యాబ‌ట్టారు. ఆదివారం ఆయ‌న హ‌న్మకొండ‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాక‌తీయ యూనివ‌ర్సిటీ కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాప‌న చేశారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం తామే అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మార్చి 11వ తేదీ సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 75రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీని పునరుద్దరించి ఉద్యోగ నోటీఫికేషన్లు ఇస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement