Saturday, November 23, 2024

TS | జేబీఎస్‌ నుంచి విజయవాడకు ఆర్టీసీ సేవలు.. టికెట్‌ రేట్లల్లో ఎలాంటి మార్పులు లేవ‌న్న‌ టీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: జూబ్లి బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. జేబీఎస్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్లాలంటే గతంలో ఎంజీబీఎస్‌కు రావాల్సి వచ్చేది. ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఇకపై జేబీఎస్‌ మీదుగా విజయవాడకు కొన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్‌ మీదుగా విజయవాడకు నడపనున్నారు.

- Advertisement -

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, జేబీఎస్‌, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌ ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఎంతో మేలుకలగనుంది. బీహెచ్‌ఎల్‌/మియాపూర్‌ నుంచి బయలుదేరే ఈ 24 సర్వీసులను ఎంజీబీఎస్‌ నుంచి కాకుండా ఇకపై జేబీఎస్‌ మీదుగా నడపనున్నారు. ఈనెల 18 నుంచే ఈ 24 బస్సు సర్వీసులు జేబీఎస్‌ నుంచి రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ బస్సుల టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement