Tuesday, November 26, 2024

TSRTC: మహిళా కండక్టర్లకు 8 గంటల వరకే డ్యూటీలు

తెలంగాణ ఆర్టీసీ ఎంపీ వి.సి.సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తరవాత 2019 డిసెంబరు ఒకటో తేదీన అన్ని స్థాయుల ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి 8 గంటలకల్లా వారి విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్యూటీ సమయాలను మారుస్తూ సమావేశం జరిగిన మూడో రోజులకే(డిసెంబరు 4న) అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, కొద్దికాలం వాటిని అమలు చేసినా.. ఆ తరవాత రద్దు చేశారు. రాత్రి 8 గంటల తరవాత కూడా విధులు నిర్వహించాల్సి వస్తోందంటూ ఇటీవల పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేయటంతో ఎండీ సజ్జనార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement