తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల ఫోటోలు ఉండొద్దని సూచించారు.
కాగా, ఐపీఎస్ అధికారిగా తన మార్క్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. బుధవారం ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. బస్సు కండెక్టర్కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం చేశారు. తోటి ప్రయాణికులతో మాటలు కలిపి.. వారి బాధలను సైతం అడిగి తెలుసుకున్నారు.