స్కూల్ బస్సుని ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు.ఈ ఘటనలో 20మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల బస్ విద్యార్థులతో పాఠశాలకు వెళ్ళే మార్గానికి వెళుతుండగా కామారెడ్డి నుండి కరీంనగర్ వెళుతున్న కామారెడ్డి డిపోకుచెందిన ఆర్టీసి బస్ వెనుక నుండి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంతో విద్యార్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు . సమాచారం అందుకున్న విద్యార్థినీ విద్యార్థుల తల్లి దండ్రులు ఆసుపత్రికి చేరుకుని వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.ప్రమాదానికి కారణం అయిన ఆర్టీసి డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. కాగా ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైదరాబాద్ కి తరలించాలని సూచించారు.
స్కూల్ బస్సుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 20మంది విద్యార్థులకు గాయాలు..ఫోన్ లో మంత్రి కేటీఆర్ ఆరా
Advertisement
తాజా వార్తలు
Advertisement