భీంగల్ బస్ డిపో విషయంలో ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని రొడ్డు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం భీంగల్ డిపోను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తో కలిసి పరిశీలించండి. ప్రజల అభిష్టం మేరకు డిపో ను ప్రారంభం చేయడం జరుగుతుందని అన్నారు. హామీలు ఇచ్చే నాయకులం కాదని, ఇచ్చినా, ఇవ్వకున్నా హామీలు నెరవేర్చే సత్తా ఉన్న ప్రభుత్వం మాదని తెలిపారు. డిపో ప్రారంభం కొరకు రూ 2 కోట్లతో, కొత్త బస్టాండ్ కొరకు రూ 50 లక్షలతో ప్రారంభం చేసేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ మూత పడ్డ భీంగల్ ఆర్టీసీ డిపోను త్వరలో ప్రారంభం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తాను ఆర్టీసీ చైర్మన్ అయ్యాక ఆర్టీసీ ని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్లుతున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా డిపో తో పాటు కొత్త బస్టాండ్ ను మంత్రి తో కలిసి పరిశీలించారు.