మరిపెడ (ప్రభ న్యూస్): ప్రజా సేవలో ఆర్ఎస్ఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడు ముందుంటుందని, రెడ్డి సంక్షేమం కోసం తన వంతు సాయం చేశానని, ఉమ్మడి వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని సురేంద్ర రాయల్ టౌన్లో రూ.3కోట్లతో టస్ట్ ఆధ్వర్యంలో సుమారు రెండు ఎకరాల్లో నిర్మించిన భవన సముదాయాన్ని(ఫంక్షన్ హాల్) ఆయన సోమవారం ప్రారంభించారు. భవనాన్ని మరిపెడ మండల రెడ్డి సంక్షేమ సంఘానికి అప్పగించారు. టీఆర్ ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మరిపెడ మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు గాదె అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్ ఎస్ రాష్ట నాయకుడు రామసహాయం రంగారెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు, హైదరాబాద్, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన రెడ్డి సంఘం సభ్యులు ముఖ్యఅతిథులు హాజరైయ్యారు.
అనంతరం మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక్షంగా శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా 40ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేశానని, జన్మనిచ్చిన ఊరి ప్రజలకు సేవ చేయటం ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. రెడ్లు అందరు కలిసి ఉండాలని పార్టీల పరంగా వేరైనా సమస్య ఎవరికొచ్చినా అందరం కలిసి ఉండి పరిష్కరించుకోవాలన్నారు.
సురేందర్ రెడ్డి సేవలు ఆదర్శనీయం: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి
తొమ్మిది పదుల వయస్పులో కూడా సురేందర్ రెడ్డి ఆర్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు చేయటం అందరికి ఆదర్శనీయమని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒక రెడ్డి సామాజకి వర్గానికే కాకుండా మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు టస్ట్ ద్వారా ఇంతటి భవనాన్ని నిర్మించి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ భవనాన్ని అందకి ఉపయోగపడేలా చూసే బాధ్యత మరిపెడ సంఘం మీద ఉందని, ఇంకా ఈ భవనానికి ఎమైన వసతులు అవసరమైతే తన వంతుగా సాయం చేస్తానన్నారు. ఉన్నత వర్గంలో ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూత అందించటం అందరి బాధ్యత అన్నారు.
రాజకీయ గురువు రుణం తీర్చుకోలేనిది: టీఆర్ ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి
ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడిన సురేందర్ రెడ్డి గారికి, ప్రధానంగా తనకు రాజకీయ అక్షర అభ్యాసం చేయించి ఎలాంటి పదవులు లేకపోయినా రాష్ట వ్యాప్తంగా గుర్తింపు ఇచ్చిన గురువు రుణం ఎన్నటికి తీర్చుకోలేనిదని తెరాసా రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎంతో చేసిన ఘనత ఆర్ఎస్ఆర్ ట్రస్ట్ కే దక్కుతుందన్నారు. మరిపెడ మండల కేంద్రంలో పాఠశాలలు, కళశాలలు, ఆలయాలు, కళ్యాణ మంటపాలు, ఇలా ఎన్నో భవనాలకు తన సొంత స్థలాన్ని అందించిన ఏకైక వ్యక్తి అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పేద రెడ్లు, ఇతర దిగువ మధ్య తరగతి వారి కోసం ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెడ్డి సంక్షేమ సంఘానికి ఆయన చేసిన సాయం ఎన్నటికి మరువలేనిదన్నారు. అనంతరం మరిపెడ మండల రెడ్డి సంఘం తరఫున సురేందర్ రెడ్డికి శాలువాతో సన్మానం చేశారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, పురుషోత్తమయగూడెం సర్పంచ్ నూకల అభినవ్ రెడ్డి, ఖమ్మం తెరాసా సీనియర్ నాయకుడు నూకల నరేష్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మెన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ ఓడీసిఎంఎస్ చైర్మెన్ కుడితి మహేందర్ రెడ్డి, కోట రత్నాకర్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి, కోట వెంకట్ రెడ్డి, టేకుల యాదగిరి రెడ్డి, రావుల రంజిత్ రెడ్డి, వీసారపు శ్రీపాల్ రెడ్డి, మల్లు ఉపేందర్ రెడ్డి, గంట్ల సుధాకర్ రెడ్డి, నోడల్ హెచ్ఎం కుడితి ఉపేందర్ రెడ్డి, వెర్మారెడ్డి నర్సిరెడ్డి, ఒంటి కొమ్ము రాంచంద్రారెడ్డి, జేసీబీ రవీందర్ రెడ్డి, కొంపెళ్లి శ్రీధర్ రెడ్డి, సైది రెడ్డి, గంట్ల మహిపాల్ రెడ్డి, రావుల సుమంత్ రెడ్డి, పెసర దినేష్ రెడ్డి, మువ్వా విజయ్ బాబు, గంధసిరి అంబరీష, పానుగోత్ రాంలాల్, గుండగాని సుందర్, తదితరులు పాల్గొన్నారు.