తెలంగాణలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ నిరుద్యోగులు మరో సారి మోసపోవద్దు అని ఆయన అన్నారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియకు డెడ్ లైన్ లేకుండా కేవలం ఎన్నికల స్టంట్ గా తీస్కొచ్చి మరోసారి మోసం చేయడానికి సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఎప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా …? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
తెలంగాణలో 11 ఏండ్ల నుండి గ్రూప్ 1 వెయ్యలేదు కాబట్టి పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి కనీసం 3-5 yrs పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా DSP ఉద్యోగాలకు కనీస ఎత్తు 167. 7 cm నుండి 165Cm లకు తగ్గించాలని కోరారు. UPSCలో IPSలకు కుడా 165Cm లే కదా?అని అన్నారు. ఆధునిక యుగం (21st Century) లో కూడా ప్రాచీన కొలమానాలు ఎందుకు? అని ప్రశ్నించారు.