Tuesday, January 7, 2025

TG | రూ.44 కోట్ల అమృత్‌ జ‌ల ప‌థ‌కం.. మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిప‌ల్ ప‌రిధిలో రూ.44 కోట్ల‌తో అమృత్ జ‌ల ప‌థ‌కం ద్వారా ఇంటింటికి నీటి స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత నీరు అందుతుంద‌న్నారు.శుక్ర‌వారం అమృత్ జల పథకాన్ని మంత్రి దామోదర్ ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రూ.1కోటి 4 లక్షలతో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని కూడా ఆయ‌న ప్రారంభించారు.

మ‌హిళ‌లు నిర్వ‌హించే తొలి పెట్రోల్ బంక్‌…
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళల చేత నిర్వహించే తొలి పెట్రోల్ బంక్ సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి దామోద‌ర్ తెలిపారు. రూ.2 కోట్లతో ఇండియన్ ఆయిల్ సౌజ‌న్యంలో ఏర్పాటు చేయ‌నున్న బంకు కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘు నందన్ రావు, స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, షఫీ, కలెక్టర్ క్రాంతి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement