గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.లాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి. కాగా ట్రాఫిక్ చలాన్ల రాయితీ ప్రకారం..ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు , తోపుడుబండ్లపై 90శాతం రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50శాతం రాయితీని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36శాతంమాత్రమే క్లియర్ అయ్యాయి.