హైదరాబాద్ – రికమెండేషన్లకు తలొగ్గకుండా ప్రతిభ కలిగిన వారికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. చాంద్రాయణగుట్ట సిఆర్ పిఎఫ్ కార్యాలయంలో నేడు జరిగిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 11 రోజ్ గార్ మేళాలలో మొత్తం సుమారుగా పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలని, , ఖాళీలు ఉండొద్దు అని ప్రధాని మోదీ ఇచ్చిన ఆదేశాలతో వేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. అందుకే రెగ్యులర్ గా నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగేదని, … ఇప్పుడు పూర్తిగా పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. తన మంత్రిత్వ శాఖలో మొత్తం రెగ్యులర్ కాంట్రాక్టు ఇతర కలిపి 8 లక్షల ఉద్యోగులు ఉన్నారని చెప్పారు..
కరోనాతో ఎన్నో దేశాల ఆర్థికంగా అతలాకుతలం అయ్యాయని అన్నారు. మన దేశంలో తయారు అవుతున్న మొబైల్ ఫోన్‌లను అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మన దేశంలో 5జి సేవలు అందుతున్నాయని తెలిపారు. చాలా దేశాల్లో 5జి లేదని ఆయన అన్నారు. అతి తక్కువ ఛార్జ్ తో నెట్ సేవలు అందిస్తున్న దేశం మన దేశం అని అన్నారు. దేశం లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయన్నారు. డిఫెన్స్ పరికరాలు ఎగుమతి చేస్తున్నామన్నారు. మన దేశ యువత అతి తొందరలోనే ప్రపంచాన్ని శాసిస్తుందన్నారు కిషన్ రెడ్డి.