Friday, November 22, 2024

రాష్ట్ర అభివృద్ధిలో ఆరోగ్య శాఖ పాత్ర కీలకం-ఎమ్మెల్యే రేఖా శ్యామ్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆరోగ్యశాఖ కీలకపాత్ర పోషించిందని ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖానాపూర్ పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా వైద్యారోగ్య రంగం నిలిచిందని కొనియాడారు. సీఎం కెసిఆర్ పాలనలో మారుమూల గ్రామాలకు వైద్య సేవలు చేరుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement