Monday, January 13, 2025

Road Rules, ప్ర‌తి ఒక్క‌రూ రోడ్డు భ‌ద్ర‌తా నియమాలు పాటించాలి – మంత్రి సీత‌క్క‌

ఆసిఫాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసాతోత్సవాల్లో స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారలు రోడ్డు భద్రతపై అవగాహ‌న పెంచుకోవాల‌న్నారు. బీర్లకు, బార్లలో ఖర్చు చేస్తున్నారు.. కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదని అన్నారు. జిల్లాలో గత ఏడాదిలో 213 మంది ప్ర‌మాదాల్లో మృతి చెందార‌ని చెప్పారు. మనతోపాటు మ‌న‌ల‌ను నమ్ముకున్న వాళ్లు ఉంటార‌ని, అందుకే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డ‌పొద్దు
వాహ‌నాలు ఎక్కి డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించరాద‌ని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని సీతక్క సూచించారు. ప్ర‌తి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని వెల్లడించింద‌న్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరి వేగంతో వెళ్లరాదు అని పేర్కొన్నారు. దీంతో పాటు వాహనదారులు రోడ్డు మీదకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గిపోతాయని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement