Thursday, December 26, 2024

TG | భువ‌న‌గిరి హైవేపై రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

మ‌రో ఐదుగురికి గాయాలు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : భువనగిరి హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయ‌ప‌డిన ఐదుగురిని భువ‌న‌గిరి ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ వెళుతుండ‌గా…
వరంగల్ నుంచి హైదరాబాద్ కు ఓ కుటుంబం కారులో వెళుతున్నారు. జాతీయ ర‌హ‌దారిలో అదుపు త‌ప్ప‌డంతో కారు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. కారులో ఉన్న ఐదుగురికి త‌ల‌కు గాయాల‌య్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement