Friday, November 22, 2024

TS: నిర్మల్ జిల్లాలో రోడ్డప్రమాదం.. ఒకరు మృతి

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు గురువారం తెల్లవారు జామున బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్‌కు చెందిన ఫర్హాన అనే యువతి మరణించింది. మరొ ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు సూచించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్స్ వద్దకు రాగానే డ్రైవర్ అతివేగంగా నడపడంతో కంట్రోల్ తప్పి బోల్తా పడిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కొందరికి కాళ్లు విరిగితే, కొందరికి చేతులు, నడుము విరిగాయని తెలిపారు. అర్ధరాత్రి నిర్మల్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బస్సులో గాయాల పోలైన బాధితులు వైద్యుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రికి భారీ పెద్ద మొత్తంలో వారి బంధువులు ఆస్పత్రికి చేరుకొని ఆసుపత్రి సూపర్డెంట్ కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని ఆరోపించారు. కొందరి పరిస్థితులు విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

సూపరిండెంట్‌కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు వైద్యుల తిరుపతి అసహనాన్ని వ్యక్తం చేశారు ఆస్పత్రిలో ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారని బాధితులు ఆరోపించారు. చాలామంది తీవ్ర గాయాలు కావడంతో వారిని అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. ఘటన స్థలానికిరూరల్ సిఐ శ్రీనివాస్ చేరుకొని సందర్శించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement