సంగారెడ్డి జిల్లాలో మంగళవారం వేకువ జామునా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్-అఖోలా జాతీయ రహదారి పై టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. సోమవారం అర్థరాత్రి ప్రాంతంలో జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు చాయ్ తాగేందుకు జోగిపేట నుంచి కారులో ముందుగా చౌటకూర్ దాబాకు వెళ్లారు. దాబా మూసి ఉండడంతో అదే కారులో మాసన్‌పల్లి వద్ద హైవే పక్కన హోటల్ వెళ్లి చాయ్ తాగారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మాసాన్‌పల్లి బిడ్జి కింద కారు ఆపి యూరిన్ పాస్ చేస్తుండగా అటుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొటిoది.
దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా జోగిపేటకు చెందిన యువకులు. వీరంతా మెకానిక్స్‌గా పని చేస్తున్నారు. మృతులను వాజిద్, హాజీ, ముక్రమ్‌గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరుకు యువకులు స్వల్ప గాయాలతో బటయపడ్డారు. ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు కావడంతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.