Tuesday, November 19, 2024

హిమాయత్‌ నగర్‌లో “రైజింగ్‌ సన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌” కొత్త బ్రాంచ్ ప్రారంభం

హైదరాబాద్‌ , : ఆటిజం, ఏడీహెచ్‌డీ, మేథోపరమైన వైకల్యం, ప్రవర్తనా పరమైన సమస్యలతో బాధపడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు తగిన సేవలనందించడం ద్వారా గుర్తింపు పొందిన రైజింగ్‌ సన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తమ నూతన శాఖను హిమాయత్‌ నగర్‌లో ప్రారంభించింది.

ఈ సెంటర్‌లో బిహేవియర్‌ థెరఫీ, ఫిజియోథెరఫీ, సెన్సరీ ఇంటిగ్రేషన్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ సహా కౌమార దశ పిల్లలకు కౌన్సిలింగ్‌, సైకాలజికల్‌ సమస్యలకు తగిన పరిష్కారాలను కూడా అందించనున్నారు.

తమ కార్యకలాపాలను విస్తరించడం గురించి రైజింగ్‌ సన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వ్యవస్ధాపకురాలు శ్వేత దేశిరాజు మాట్లాడుతూ ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లల కోసం చికిత్సనందించడం పట్ల తనకున్న అచంచల విశ్వాసమే తనను ముందుకు నడిపిస్తుందన్నారు. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు, థెరపిస్ట్‌లకు సురక్షితమైన ప్రాంగణాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు. గత సంవత్సర కాలంలో తాము 80 మంది పిల్లలకు సేవలందించామన్నారు. ప్రతి చిన్నారికీ తమ వయసుకు తగ్గ ఎదుగుదల ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్న ఆమె, ఈ ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులకు సైతం విజయవంతమైన భవిష్యత్‌ను అందించాలన్నదే తమ ప్రయత్నమన్నారు.

తమ రైజింగ్‌ సన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఈ ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లల కాగ్నిటివ్‌, స్పీచ్‌, మోటర్‌, కమ్యూనికేషన్‌, సోషియో–ఎమోషనల్‌ డెవలప్‌మెంట్‌ పై అధికంగా దృష్టి సారిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement