Friday, November 22, 2024

ట’మాట’ విననంటోంది..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : మహానగరానికి జిల్లాల నుంచి విపరీతంగా వచ్చే టమాట దిగుమతి గణనీయంగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కావడంతో మండే ఎండలకు పంటలన్ని ఎండిపోయాయి. అయితే పాలీ హౌస్‌ల ద్వారా పండించినవే ప్రస్తుతం మార్కెట్లకు వస్తుండటం గమనార్హం. కిలో ధర రూ.40 నుంచి రూ.50 వరకు డిమాండ్‌ పలుకుతోంది. అయితే రైతు బజార్లలో మాత్రం కిలోను అధికారికంగా రూ.28కి విక్రయిస్తున్నారు. ఇక సూపర్‌ మార్కెట్లు, ఇతరత్రా సంపన్నవర్గాలుండే చోట అంటే ఏసీ పెట్టి అమ్మే దుకాణాల్లో అయితే ఏకంగా కిలో రూ.60కి విక్రయిస్తుండటం గమనార్హం. ఏపీ, మహారాష్ట్ర కూరగాయల సరుకులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పెరిగిన రవాణా ఖర్చులు కూడా కలపడంతో ధరలు పెరిగిపోయాయి. ఆకస్మాత్తుగా పెరిగిపోయిన ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టమాటాలే కాకుండా ఇతర కూరగాలయ లభ్యత కూడా తక్కువగా ఉండటం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement