హైదరాబాద్, (ప్రభన్యూస్) : దేశ రాజధానిలోనే కాదు… రాష్ట్ర రాజధానిలో సైతం కాలుష్యం కోరలు చాచుతుంది. రోజురోజుకు దిగజారుతున్న ఆరోగ్య పరిస్థితులపై వాతావరణ నిపుణులు పర్యవరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కి ఫాక్టరీలతో పాటు కాలుష్యం కూడా క్యూ కడుతుంది. గత నెలతో పోల్చితే.. ఈ నెలలో హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగించే ప్రమాదకర ధూళి రేణువులు భారీగా వాతావరణంలోకి విడుదలయ్యాయి. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తూ, అనారోగ్య సమస్యలకు కారణమయ్యే పిఎం 10, పిఎం 25 ధూళి కణాలు వాతావరణంలోకి అధికంగా విడుదలయ్యాయి.
ఈ మేరకు సెప్టెంబర్‌తో పోల్చుకుంటే అక్టోబర్‌లో వీటి తీవ్రత భారీగా పెరిగినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్పిఎస్బి) తెలిపింది. కంటికి కనిపించని అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే ఈ ధూళి కణాలు గాలి ద్వారా ఊపిలితిత్తుల్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. సున్నిత ప్రాంతమైన జూపార్క్ దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో ఒక పక్క చలితో వనుకుతుంటే మరోపక్క ప్రజలు ఈ కాలుష్య కోరలకు బలైతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గటంతోనే ధూళి కణాల తీవ్రత పెరిగినట్లు పర్యావరణ శాస్త్ర వేత్తలు పేర్కొంటున్నారు. వేసవిలో వాతావరణం పోడిగా ఉండటం వల్ల గాల్లోకి వెలువడిన ఉద్గారాలు స్వేచ్ఛగా ప్రయాణించగలవు.
అదే శీతాకాలంలో వాతావరణంలో ఉండే మంచు కారణంగా ధూళి కణాలు ఎటూ కదల్లేక భూ ఉపరితలానికి కొద్ది ఎత్తులోనే ఉండిపోతాయి. దాంతో జీవరాశులు గాలిని పీల్చుకునే వాతావరణంలో భారీగా ధూళి కణాలు పోగై ప్రాణులకు హాని కలిగిస్తున్నాయి. సనత్‌నగర్‌లో పీఎం 2.5 కణాలు అత్యధికంగా పెరిగాయి. కేవలం ఒక నెల కాలంలో 32 ఎంజీలు పెరిగినట్లు గణాంకాల్లో వెల్లడయింద. హెచ్‌సీయూ దగ్గర 7 నుంచి 37 ఎంజీలు, చార్మినార్‌లో 17 నుంచి 25ఎంజీలు, జీడిమెట్లలో 18 నుంచి 28 ఎంజీలకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు..
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily