Friday, November 15, 2024

TG: భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి.. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..

భద్రాచలం ఐటీడీఏ, జులై 25 (ప్రభ న్యూస్): భద్రాద్రి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి క్రమక్రమంగా మళ్లీ పెరగడంతో ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి సోమవారం మధ్యాహ్నం 2.04గంటలకు గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తర్వాత క్రమేపీ పెరుగుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు 51.60 అడుగులకు పెరిగిన గోదావరి 11 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం తెల్లవారుజాము 3.51 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.

బుధవారం సాయంత్రం 7 గంటలకు 45.2 అడుగుల మేర గోదావరి నిలకడగా ప్రవహించింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మళ్ళీ పెరుగుతూ వస్తుంది. 12 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ మూడు రోజుల వ్యవధిలో మరోమారు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం రాత్రికి 50 అడుగులు వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఆదికారులు పేర్కొన్నారు. మళ్ళీ గోదావరి పెరగడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement