Monday, November 25, 2024

RIP – మృత్యువే గెలిచింది

హైదరాబాద్ – కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు.

తొమ్మిదో తరగతి బాలిక సి.శైలజ (16)కు అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్సకు శరీరం సహకరించడం లేదని, పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం బాలిక మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దాదాపు 20 రోజులుగా చికిత్స పొందిన ఆమె చివరకు మృత్యువాత పడ్డారు. శైలజ మృతితో తల్లిదండ్రులు, బంధువు ల రోదనలు మిన్నంటాయి. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం పూర్తి..

- Advertisement -

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ మరణించడంతో తల్లి మీరాబాయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శైలజ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి కావడంతో పోలీస్‌ ఎస్కార్ట్‌ మధ్య ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.

₹50లక్షల పరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు డిమాండ్‌

విద్యార్థిని శైలజ (16) మృతిపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ”ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజన బిడ్డకు శాపంగా మారింది. విషాహారంతో విద్యార్థిని ప్రాణం పోవడం కలచివేసింది. శైలజ ప్రాణాలు బలిగొన్న పాపం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే. విద్యార్థిని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆమె మరణాన్ని దాచేందుకు ప్రభుత్వం యత్నించింది. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి” అని డిమాండ్‌ చేశారు.

స‌ర్కార్ నిర్ల‌క్ష్యంతోనే విద్యార్ధిని బ‌లి : మేడే రాజీవ్ సాగ‌ర్

ఎంతో భవిష్య‌త్ ఉన్న వాంకిడి గిరిజ‌న గుర‌కుల విద్యార్ధిని శైల‌జ కాంగ్రెస్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యానికి బ‌లైంద‌ని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ మండిప‌డ్డారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివి వారి కుటుంబానికి అండ‌గా నిల‌వాల్సిన విద్యార్ధిని ఈ విదంగా విగ‌త‌జీవి మార‌డం దుర‌దృష్ట‌మ‌న్నారు.

కావాల‌నే రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థ‌ల‌కు కొమ్ము కాసేందుకు కేసీఆర్ స్థాపించిన గురుకులాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. 25 రోజులుగా నిమ్స్ ఆస్ప‌త్రిలో వెంటిలేటర్ మీద విద్యార్ధిని అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబు చెప్పాల‌న్నారు.

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చిన 11 నెల‌ల్లోనే 42 మంది విద్యార్ధులు ప్రాణాలు కొల్పోయార‌ని మండిప‌డ్డారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల క‌లుషిత ఆహారంతో విద్యార్ధులు ఆస్ప‌త్రుల పాలు అవుతున్న ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టకుండా అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం వ‌ల్లే ఈఘోరం జ‌రిగింద‌న్నారు. గిరిజన విద్యార్థినీ మ‌ర‌ణానికి బాధ్య‌త వ‌హిస్తూ వారి కుటుంబానికి అండ‌గా నిలువాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement