న్యూ ఢిల్లీ -గొప్ప ఆర్థిక సంస్కర్త, మేధావి దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టీ.రామారావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావులు సందర్శించి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న వెంటనే వారు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు.ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి,పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
అధ్యాపకుడిగా, ఆర్థిక సలహాదారుగా,యుజీసీ ఛైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా,ప్రతిపక్ష నాయకుడిగా,ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన ఎనలేని సేవల్ని స్మరించుకున్నారు.దివంగత మాజీ ప్రధాని సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్,ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కేటీఆర్, సురేష్ రెడ్డి,రవిచంద్ర, దామోదర్ రావులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక రేపు జరిగే మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో కేటీఆర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ ప్రతినిధుల బృందం పాల్గొననుంది.