హైదరాబాద్ – బలగం మొగులయ్య మృతిపట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాటకు చలించని హృదయం, చెమర్చని కళ్లు లేవన్నారు. పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని చెప్పారు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తుచేశారన్నారు. మొగులయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
RIP – మీ పాటకు చెమర్చని కళ్లు లేవు – బలగం మొగిలియ్య మృతికి కెటిఆర్ సంతాపం
Advertisement
తాజా వార్తలు
Advertisement