హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
కేసీఆర్‌కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
- Advertisement -
సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన వైద్యశాలకు తరలివెళ్లారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు సమాచారం.