Saturday, October 26, 2024

RIP – గుస్సాడి నృత్యకారుడు గ్రహీత కనకరాజు కన్నుమూత – రేవంత్ సంతాపం

హైదరాబాద్ – గుస్సాడి నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కుమురంభీం జిల్లా జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో తుదిశ్వాస విడిచారు.

గుస్సాడి నృత్యానికి జాతీయ గుర్తింపు తెచ్చినందుకు గాను 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. శనివారం మార్లవాయిలో కనకరాజు అంత్యక్రియలు ఆదివాసి సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రేవంత్ రెడ్డి సంతాపం

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు గారు అసామాన్యుడని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు గారు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన అరుదైన కళాకారుడని, వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement