భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(75) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబ్బయ్య.. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు
ఇల్లందు మండలం హనుమంతుల పాడు గ్రామానికి చెందిన అబ్బయ్య సీపీఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి మొదటగా సుధిమల్ల సర్పంచ్ గా ఎన్నికైన అబ్బయ్య,అంచలంచెలుగా ఎదిగి బూర్గంపాడు,ఇల్లందు నుండి సీపీఐ తరుపున పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో రాజకీయంగా మార్పులు చోటు చేసుకోవడం తో టి డి పి లో చేరి ఇల్లందు నుండి ఎమ్మేల్యే గా గెలుపొందారు. అనంతరం టి ఆర్ ఎస్ లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. కొద్దిరోజులకే బి జి పి లో చేరి అందులో ఇమడలేక తిరిగి టి ఆర్ ఎస్ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అబ్బయ్య మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య. ,మాజీ ఎమ్మెల్యే లు హరిప్రియ నాయక్,గుమ్మడి నరసయ్య,సీపీఐ,సిపిఎం,టి ఆర్ ఎస్,బి జే పీ,కాంగ్రెస్,ఎన్ డి,మాస్ లైన్, పార్టీ ల నాయకులు సంతాపం తెలిపి,వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
. అబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1983లో బూర్గంపాడు నుంచి అబ్బయ్య ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 2009లో ఇల్లందు నుంచి విజయం సాధించారు.