హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆప్తమిత్రుడు ,మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి ఇవాళ మృతి చెందారు..
80 సంవత్సరాల దొమ్మాట రామచంద్ర రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించినట్లు సమాచారం.
కెసిఆర్ సొంత గ్రామం, కొండపాక లోనే దొమ్మట రామచంద్రారెడ్డి జన్మించారు. .ఆయనకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఆయన కుటుంబం ఉంటుంది.
. 1985 సంవత్సరంలో సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు కెసిఆర్ మిత్రుడు రామచంద్రారెడ్డి. అయితే అప్పుడు దొమ్మాట నియోజకవర్గం ఉండేది కానీ ఇప్పుడు దాన్ని దుబ్బాక గా మార్చారు. అంతేకాకుండా సిద్దిపేట నియోజకవర్గంగా చేసేశారు. సిద్దిపేట నియోజకవర్గమైన తర్వాత టిఆర్ఎస్ కంచు కోటగా మారిపోయింది. ఇక దొమ్మట రామచంద్ర రెడ్డి మృతి పట్ల హరీష్ రావు తో పాటు కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు.