Sunday, November 24, 2024

RIP – పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ కన్నుమూత

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ధర్మపురి శ్రీనివాస్ @ డీఎస్‌ కనుమూశారు. ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవాళ సాయత్రం వరకు ఆయన మృతదేహాన్ని నిజామాబాద్‌లోని స్వగృహానికి తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.విషయం తెలియగానే పెద్ద కుమారుడు, మాజీ మేయర్‌ సంజయ్‌ హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఢిల్లీ నుంచి బయలుదేరారు.

కాగా కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రిటికల్‌ సర్జరీ తరువాత డీఎస్‌ పూర్తిగా తన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అనేక నెలలుగా డీ ఎస్ ఇంటికే పరిమితం అయ్యారు. డీఎస్‌ను కుటుంబ సభ్యులు కొంతకాలంగా ఎవరినీ కలవనీయడం లేదు. చివరకు ఇవాళ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

. కాంగ్రెస్‌ కండువా కప్పుకుని చనిపోవాలన్నది ఆయన అంతిమ కోరికగా చెప్పుకునే వాడు. అలాగే ఇటీవల తన పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్ నీ పార్టీలో చేర్పించడానికి ఆయన తో పాటు గాంధీ భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తుదకు కాంగ్రెస్ లోనే తన శ్వాశ వదిలారు. రాజకీయాల్లో తనదైన శైలితో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు.

- Advertisement -

డి. శ్రీనివాస్ ప్రస్థానం

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్.. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించిన డి. శ్రీనివాస్.. 1989,1999,2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైనా డీఎస్.. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా పని చేసిన డీఎస్.. 2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీర్ఎస్లో చేరిన డి. శ్రీనివాస్.. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన డీఎస్.. అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూటి కాంగ్రెస్లో చేరిన డీఎస్.. డి. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు.. నిజామాబాద్ మేయర్గా పని చేసిన డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్.. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్న రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్..

డీఎస్ కు ప్రముఖుల నివాళి

కాగా, డీఎస్ పార్థీవదేహన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు.. చివరి చూపు చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. వివిధ పార్టీల నేతలు అక్కడి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement