ఏజెన్సీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరజనేతరులకు కూడా పోడు భూములపై హక్కు కల్పించాలని జెడ్పిచైర్ పర్సన కుమారి ఆంగోత్ బిందుకోరారు. శుక్రవారం రాష్ట్ర గిరిజన స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బయ్యారం మండలంలో అనేక దశాబ్దాలుగా గిరిజ నేతరులు కూడా ఏజెన్సీలో గిరిజనులతో కలిసి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.వారికి కూడా గిరిజనులతో సమానంగా 2005డిసెంబర్ నాటికి 18 సవత్సరాలునిండిన సాగు దారులందరికి ఆర్వోఎఫ్ఆర్ హక్కు పట్టాలు మంజూరీ చేయాలని కోరారు.అదే విధంగా రైతుబంధు,రైతు బీమా,అమలు చేయాలని కోరారు
.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూలమధుకర్ రెడ్డి,టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఆంగోత్ శ్రీకాంత్ నాయక్, రైతు నాయకులు రాసమళ్ళ నాగేశ్వరావ్, నాయకులు తమ్మీశెట్టి వెంకటపతి,సిపిఎం మండల కార్యదర్శి నంబూరి మధు,సీపీఐ మండల కార్యదర్శి,సారిక శ్రీను,సర్పంచ్ శ్రీమతి వజ్జ అనసూర్య,సొసైటీ డైరెక్టర్ కసనబోయిన శ్రీను,రైతులు పాల్గొన్నారు.