హైదరాబాద్ – వీధి కుక్కలను ప్రజలు అడాప్ట్ చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ చేసిన సూచనను వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పు పట్టారు..ఇటువంటి వ్యాఖ్యలు చేసిన మేయర్ తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా ట్విట్లు చేశారు. జంటనగరాలలోని కుక్కలను ఇంటికి తీసుకెళ్లి ఆహారం ఇవ్వాలంటూ విజయలక్ష్మీపై సెటైర్ వేశారు వర్మ.. అంతేకాకుండా మేయర్ తాను పెంచుకుంటున్న శునకానికి ఆహారం తినిపిస్తున్న 2021 మార్చి 3వతేదిన పోస్ట్ చేసిన అప్పటి వీడియోని ఇప్పుడు ట్యాగ్ చేస్తూ, అప్పటి శునకాలు ఇప్పుడు మనుషులపై దాడులు చేస్తున్నాయని,దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ సిటీ పోలీస్, కెటిఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశాడు వర్మ..
అలాగే కెటిఆర్ కు మరో ట్విట్ చేస్తూ, జంటనగరాలలోని అయిదులక్షల కుక్కలను వెంటనే డాగ్ షెల్టర్ కు తరలించాలని మంత్రిని కోరారు..